రజనీ ముద్దు... ఓ పెద్ద ప్రశంస

‘‘సినిమా అంటే నా దృష్టిలో ఒక సంబరం. ఆద్యంతం సందడిగా ఉండాలని భావిస్తా. మాది ఉమ్మడి కుటుంబం. పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లలవరకు అందరూ కలిసి వెళ్లేవాళ్లం. అలా చూసే ఓ   సినిమాని ఇప్పుడు నేను తీయడం

Updated : 04 Nov 2021 09:37 IST

‘‘సినిమా అంటే నా దృష్టిలో ఒక సంబరం. ఆద్యంతం సందడిగా ఉండాలని భావిస్తా. మాది ఉమ్మడి కుటుంబం. పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లలవరకు అందరూ కలిసి వెళ్లేవాళ్లం. అలా చూసే ఓ   సినిమాని ఇప్పుడు నేను తీయడం ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకుడు శివ. వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు తీస్తున్న ఆయన ఇటీవల రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’ తీశారు. ఆ చిత్రం ‘పెద్దన్న’ పేరుతో గురువారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శివ విలేకర్లతో మాట్లాడారు.

* ‘‘రజనీకాంత్‌కి వీరాభిమానిని నేను. ఓ అభిమానిలాగే ఈ సినిమాని తీశా. ఆయన్నుంచి కోరుకునే మాస్‌, యాక్షన్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ‘విశ్వాసం’ తర్వాత రజనీకాంత్‌ నన్ను పిలిచారు. నాతో ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నావని అడిగారు. అన్ని రకాల భావోద్వేగాలున్న సూపర్‌స్టార్‌ సినిమా తీస్తానని చెప్పా. కథ వినగానే ఆయనకి నచ్చింది.

* ‘‘రజనీకాంత్‌తో కలిసి చేసిన ఈ సినిమా ఓ గొప్ప అనుభవం. మంచి సన్నివేశాలు చేస్తే అందరి ముందు ప్రశంసించేవారు. మొదట కొంత ఎడిట్‌ చేసి చూపించా. అసలు సిసలు నా సినిమా చూసినట్టు అనిపిస్తోందని మెచ్చుకున్నారు. ఆ తర్వాత పూర్తి చిత్రం చూపించా. బయటికి వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారు. అది నేనెప్పటికీ మరిచిపోలేను. నాకు దక్కిన అతి పెద్ద ప్రశంస అది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని