Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ

టాలీవుడ్‌ అగ్ర నటుడు చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన దర్శకుడు తన సినిమా సంగతులు పంచుకున్నారు.

Published : 23 Sep 2023 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బింబిసార’ (Bimbisara)తో అటు చిత్ర పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వశిష్ఠ (Mallidi Vasishta). కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇటీవల నిర్వహించిన ‘సైమా’ (SIIMA) వేడుకల్లో ఉత్తమ పరిచయ దర్శకుడిగా వశిష్ఠ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi)తో తెరకెక్కించనున్న #chiru157 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాల కబుర్లు పంచుకున్నారు.

శ్రద్ధాదాస్‌ ‘లేజర్‌ ఫోకస్‌’.. బెంగళూరులో నభా.. రకుల్‌ ‘ఫెస్టివ్‌ మూడ్‌’!

‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) (Jagadeka Veerudu Athiloka Sundari) తర్వాత చిరంజీవిని మనం ఫాంటసీ చిత్రాల్లో చూడలేదు. ఈ సినిమా అప్పటి పిల్లలను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈతరం పిల్లలకు చిరంజీవిని అదే తరహాలో చూపించాలనుకుంటున్నా. ఫాంటసీ సినిమాలు, కార్టూన్స్‌ చూస్తూ, చందమామ కథలు చదువుతూ పెరిగాను. మార్వెల్‌, డీసీ సూపర్‌హీరోల స్టోరీలు, విఠలాచార్య చిత్రాలను బాగా ఇష్టపడతా. ఓరోజు పాత మిక్కీ మౌస్‌ కార్టూన్‌ చూస్తున్న సమయంలో ‘బింబిసార’ సినిమా కథాలోచన వచ్చింది’’

‘‘తెరపై ఇలాంటి కొత్త ప్రపంచాన్ని సృష్టించడంలో స్వేచ్ఛ తీసుకోవచ్చు. గుర్రాలు, ఏనుగులు గాల్లో ఎరగడంలాంటి ఎన్నో మ్యాజిక్స్‌ను జోడించవచ్చు. ‘అవతార్‌’లా కొత్త ప్రపంచాన్ని రూపొందించడం, ప్రేక్షకులను అందులో లీనమయ్యేలా చేయడంలో ఆనందం ఉంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యమున్న ఈ సినిమా కోసం పలు స్టూడియోస్‌తో చర్చలు జరుపుతున్నాం. అయితే అన్నింటికీ మించి స్టోరీ, స్క్రీన్‌ప్లేనే సినిమాకు బలమనేది నా అభిప్రాయం’’ అని పేర్కొన్నారు. నవంబరులో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకానుందని సమాచారం. కథానాయికగా అనుష్క, నయనతార పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరిలో ఒకరు చిరంజీవి సరసన నటించే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు