
Virata Parvam: పాత్ర కోసం సాయి పల్లవి ఆహారం తీసుకోలేదు: వేణు ఊడుగుల
ఇంటర్నెట్ డెస్క్: ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు వేణు ఊడుగుల. ‘వాస్తవ ఘటనలే నా కథా వస్తువులు’ అని చెప్తుండే ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ‘విరాటపర్వం’ (Viarataparvam). రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా వేణు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. సినిమా గురించి, నాయకానాయికల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. వాటిల్లోని కొన్ని సంగతులివీ..
* విరాటపర్వం ఎలా ఉండబోతుంది?
వేణు: 90ల నాటి కథ ఇది. గాఢమైన ప్రేమ, రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. మనకు బాగా కావాల్సిన వారు చనిపోతే ఎలాంటి బాధ ఉంటుందో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అదే భావోద్వేగానికి లోనవుతారు. ఈ సినిమాలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
* ఈ సినిమాలో నక్సలిజాన్ని చూపించినట్టున్నారు? మీ తొలి చిత్రంలోనూ సామాజికాంశాలను ప్రస్తావించారు?
వేణు: అలాంటి సమాజంలోనే నేను పుట్టి, పెరిగా. మాది వరంగల్. అక్కడి సమస్యలు, విప్లవాలు నాకో భిన్నమైన దారిని చూపాయి. దీంతోపాటు నేను చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తుల ప్రభావమూ సినిమాపై పడుండొచ్చు.
* ఈ సినిమా కోసం నక్సలైట్ల గురించి రీసెర్చ్ చేశారా?
వేణు: లేదు. ఇంతకు ముందు చెప్పినట్టు, నక్సల్స్ జీవితాలు ఎలా ఉంటాయో బాల్యం నుంచే నాకు అనుభవం ఉంది. మా ఇంట్లో నుంచి చూస్తుంటే నక్సల్స్, పోలీసుల ఎన్‌కౌంటర్లు కనిపిస్తుండేవి. వాటికి నేను పత్యక్ష సాక్షిని. అందుకే ఈ కథ కోసం ఎలాంటి రీసెర్చ్ చేయలేదు.
* ఎవరిని దృష్టిలో పెట్టుకుని రానా పాత్రను సృష్టించారు?
వేణు: నిజామాబాద్‌కు చెందిన శంకరన్న అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని రానా పాత్రను రాశా. పాత్ర పేరు ‘రవన్న’ అని పెట్టా.
* ఈ క్యారెక్టర్‌కు రానానే తీసుకోవడానికి కారణమేంటి? ఇంకా ఎవరినైనా సంప్రదించారా?
వేణు: ఈ పాత్ర కోసం ముందుగా రానానే కలిశా. మరెవరికీ ఈ స్క్రిప్టు వినిపించలేదు. సామాజిక స్పృహ, వాస్తవికతను తెరపైకి తీసుకురావాలనే ఆకాంక్ష.. తదితర లక్షణాలున్న నటుడు రానా. ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రకు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం ముందు నుంచీ ఉంది. నేను అనుకున్నదాని కంటే మంచి ఔట్‌పుట్ ఇచ్చారాయన.
* సాయిపల్లవి గురించి..
వేణు: లుక్స్, నటన పరంగా పాత్రలో ఒదిగిపోయింది. ఆమె అసాధారణ నటి. అంకిత భావంతో పనిచేస్తుంది. పాత్రకు తగ్గ అవతారంలోకి మారేందుకు ఓ రోజు ఆహారం కూడా తీసుకోలేదామె. ఈ చిత్రంలో ఆమె వెన్నెల అనే క్యారెక్టర్‌లో కనిపిస్తుంది.
* ఈ సినిమా ఇతర భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారా?
వేణు: ప్రస్తుతానికి తెలుగు, మలయాళం, తమిళంలోనే విడుదల చేయాలనుకుంటున్నాం. హిందీ గురించి ఇంకా ఆలోచించలేదు.
* మీపై ఏ దర్శకుడి ప్రభావం ఉంటుంది?
వేణు: ప్రభావం అనికాదు గానీ కె. బాలచందర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతా.
* తదుపరి చిత్రాలేంటి?
వేణు: ఇప్పటికైతే ఏం ఖరారు కాలేదు. పెద్ద హీరోల నుంచి ‘ఓకే’ అనే మాట వినిపిస్తే నిర్మాణ సంస్థలే వాటిని ప్రకటిస్తాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Chemist killing: నుపుర్ శర్మ వివాదంలో మరో హత్య ..! దర్యాప్తు ఎన్ఐఏ చేతికి..
-
India News
IRCTC: కప్ టీ ₹70.. రైల్వే ప్రయాణికుడి షాక్.. ట్వీట్ వైరల్!
-
Politics News
Pawan Kalyan: కుల, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలి: పవన్
-
General News
Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
-
Movies News
Samantha: విజయ్ దేవరకొండ రూల్స్ బ్రేక్ చేయగలడు: సమంత
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- RaviShastri: బుమ్రా బ్యాటింగ్‌కు రవిశాస్త్రి ఫిదా.. బీసీసీఐ ప్రత్యేక వీడియో..!
- IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. టీమ్ఇండియాదే పైచేయి
- Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్‌బాబు
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి
- social look: లవ్‌లో పడిన రష్మి.. జిమ్‌లో పడిన విద్యురామన్.. ‘శ్రద్ధ’గా చీరకడితే..
- తప్పుడు కేసుపై 26 ఏళ్లుగా పోరాటం.. నిర్దోషిగా తేలిన 70ఏళ్ల వృద్ధుడు
- IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
- Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన యశ్వంత్‌సిన్హా పర్యటన
- Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?