Disney+ Hotstar: ఇక డిస్నీ+హాట్‌స్టార్‌లో డాల్బీ అట్మాస్‌ సౌండ్ క్వాలిటీ

డిస్నీ+ హాట్‌స్టార్‌ సంస్థ తమ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌ను డాల్బీ అట్‌మోస్‌ సౌండ్‌ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు...

Updated : 16 Sep 2022 19:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత మంచి విజువల్‌ వండర్‌ సినిమా, వెబ్‌ సిరీస్‌ అయినా.. సౌండ్‌ క్వాలిటీ స్పష్టంగా లేకుంటే దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేం. తెర మీద కనిపించే కదలికలకు అనువైన ధ్వని తోడైతేనే ప్రేక్షకుడు దాన్నిఅనుభూతి చెందుతాడు. అందుకే పెద్ద పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సైతం మెరుగైన ఆడియో క్వాలిటీని ప్రేక్షకుడికి అందించేందుకు మొగ్గు చూపుతుంటాయి. ఈ నేపథ్యంలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ hotstar) సంస్థ తమ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు డిస్నీ+ హాట్‌స్టార్‌ కంటెంట్‌ను డాల్బీ అట్మాస్‌ (Dolby Atmos) సౌండ్‌ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లతోపాటు టీవీ, ఏవీఆర్‌, సౌండ్‌బార్‌లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు డిస్నీ+ హాట్‌స్టార్‌లో కంటెంట్‌కు డాల్బీ విజన్‌ సౌండ్‌ క్వాలిటీ సపోర్ట్‌ మాత్రమే ఉండేది. కొత్తగా డాల్బీ అట్మాస్‌తో మల్టీడైమెన్షల్‌, స్పాషియల్ సౌండ్‌తో కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. అన్ని కేటగిరీల సబ్‌స్క్రైబర్లకు డాల్బీ అట్మాస్‌తో కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది. 

డాల్బీ అట్మాస్‌ అనేది సరౌండింగ్ సౌండ్‌ సాంకేతికత. ఇది ఒకేసారి 128 ఆడియో ట్రాక్‌లను ప్రధాన ఆడియోతో కలిపి అన్ని రకాల ఆడియో డివైజ్‌లలో డైనమిక్ సౌండింగ్‌ అనుభూతిని అందిస్తుంది. ప్రస్తుతం దాదాపు అన్ని సినిమా థియేటర్లు ఇదే సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. యూజర్లు డాల్టీ అట్మాస్‌ సాంకేతికత కలిగిన కంటెంట్‌ను సులువుగా గుర్తించేందుకు వీలుగా డాల్బీ బ్యాడ్జ్‌ అనే ట్యాగ్‌ ఉంటుంది. దీంతో యూజర్‌ సదరు కంటెంట్‌ను డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ క్వాలిటీతో ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌ ప్రారంభ ఏడాది కాలానికి సబ్‌స్క్రిప్షన్‌ ధర ₹ 499 (మొబైల్ - హెచ్‌డీ క్వాలిటీ‌)కాగా, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ₹1,499 (మొబైల్‌, ల్యాప్‌టాప్‌, టీవీ - 4K క్వాలిటీ)గా ఉన్నాయి. మూడు నెలల కాలానికి ₹ 149 (మొబైల్ - హెచ్‌డీ క్వాలిటీ‌), ఏడాది కాలానికి సూపర్‌ ప్యాక్ సబ్‌స్క్రిప్షన్‌ ధర ₹ 899 (ల్యాప్‌టాప్‌, టీవీ - ఫుల్‌హెచ్‌డీ).  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని