‘కేజీయఫ్‌’ హీరోకి ఉన్న కార్లెన్నో తెలుసా?

కన్నడ కథానాయకుడు యష్‌ ‘కేజీఎఫ్‌’ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ దక్షిణాదితో పాటు హిందీలోనూ 

Updated : 27 Feb 2021 09:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కన్నడ కథానాయకుడు యశ్‌ ‘కేజీయఫ్‌’ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘కేజీయఫ్‌’కి సీక్వెల్‌గా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న ‘కె.జి.యఫ్‌: చాప్టర్‌2’లో నటిస్తున్నారు. యశ్‌కి కార్లంటే చాలా ప్రేమ. అందుకే ఆయన దగ్గర ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డి జీఎల్ఎస్ లైనప్‌లో టాప్ మోడల్‌ కార్‌తో పాటు బీఎమ్‌డబ్ల్యు 520డీ లాంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. యశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆ మధ్య ‘కేజీయఫ్‌2’ సినిమా టీజర్‌ విడుదలై సంచలనం సృష్టించింది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. ప్రతినాయకుడు అధీరా పాత్రలో సంజయ్‌ దత్‌ నటిస్తుండగా..రవీనా టాండన్, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రాన్ని దక్షిణాదితో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమా జులై 16, 2021న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని