Suriya40 First Look: నిమిషాల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్
సూర్య అభిమానులంతా ఈలలు వేసి గోల చేసేందుకు సిద్ధంకండి. ఎందుకంటరా..? తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి ఊరమాస్ పాత్రలో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నాడు. సూర్య నటిస్తున్న తర్వాతి చిత్రం ‘ఎత్తారెక్కుమ్ తునిందవన్’ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: సూర్య అభిమానులంతా ఈలలు వేసి గోల చేసేందుకు సిద్ధంకండి. తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి ఊరమాస్ పాత్రలో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తర్వాతి చిత్రం ‘ఎత్తారెక్కుమ్ తునిందవన్’ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య మరోసారి ఊరమాస్‌గా కనిపించనున్నట్లు ఫస్ట్‌లుక్ వీడియో చెప్పేస్తోంది. తెల్ల పంచె, చొక్కా వేసుకొని ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో తుపాకీతో ఓ షెడ్డులో విలన్లను వెంబడించి వేటాడుతూ సూర్య కనిపించాడు. సూర్య లుక్‌కు తోడు.. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కాగా.. విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ వీడియో లక్షల వీక్షణలు సొంతం చేసుకుంది.
గత సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంలో కనిపించిన సూర్య ఈ చిత్రంలో పూర్తి భిన్నంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సందేశం ఇచ్చే ఓ మాస్ సినిమాగా దీన్ని తీర్చిదిద్దనున్నారట. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. సత్యరాజ్, శరణ్య, సిబి, జయప్రకాశ్ కీలకపాత్రలు పోషించనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Karnataka: ప్రభుత్వంపై విమర్శలు.. వేదికపై మైకు లాక్కున్న సీఎం
-
Sports News
IND vs NZ: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. గాయం కారణంగా రుతురాజ్ ఔట్..
-
Politics News
Hindenburg: అదానీ గ్రూపుపై ఆరోపణలు.. దర్యాప్తు చేయాల్సిందే : కాంగ్రెస్
-
Politics News
Naralokesh-Yuvagalam: యువత కోసం ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటిస్తాం: నారా లోకేశ్
-
Sports News
U19W T20 World Cup: అండర్ 19 T20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు