Hyderabad: సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టపోయేది నిర్మాతలే: ఫిల్మ్‌ ఫెడరేషన్‌

సినీ కార్మికుల వేతనాలను 45 శాతం పెంచితేనే షూటింగ్స్‌కు హాజరువుతామని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే 45 శాతం వేతనాలు పెంచే నిర్మాతల షూటింగ్స్‌కు

Published : 23 Jun 2022 01:39 IST

హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాలను 45 శాతం పెంచితేనే షూటింగ్స్‌కు హాజరువుతామని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. అయితే 45 శాతం వేతనాలు పెంచే నిర్మాతల షూటింగ్స్‌కు మాత్రమే సినీ కార్మికులు హాజరవుతారని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ తేల్చి చెప్పింది. వేతనాలు పెంచాలనుకునే నిర్మాతల నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకున్నాకే షూటింగ్స్‌కు వెళ్లనున్నట్లు ఫెడరేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.

‘‘మేం పాత వేతనాలతో షూటింగ్‌లకు వెళ్లం. కొత్త జీతాలతోనే హాజరవుతాం. నిర్మాతలు హెచ్చరికలు చేసినట్లుగా మాట్లాడారు. వేతనాలు పెంచకపోతే మూకుమ్మడి ఆందోళనలు కొనసాగుతాయి. ఇవాళ 25 సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.  సినిమాల చిత్రీకరణ ఆగిపోవడంతో 5 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సినీ కార్మికులను అణగదొక్కేలా నిర్మాతల మండలి తీరు ఉంది. సినీ కార్మికుల్లో విభేదాలు సృష్టిస్తే నష్టపోయేది నిర్మాతలే. మంత్రి తలసాని చొరవతో నిర్మాతలతో చర్చలకు వెళ్తాం’’ అని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు