Katrina Kaif: పెళ్లి సందడి మొదలైందా?

బాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా మోగనుందా? అంటే అవునేనే సంకేతాలే వస్తున్నాయి. కత్రినాకైఫ్‌ పెళ్లి పీటలెక్కనుందంటూ మరోసారి వార్తలొస్తున్నాయి....

Updated : 29 Oct 2021 06:17 IST

బాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా మోగనుందా? అంటే అవునేనే సంకేతాలే వస్తున్నాయి. కత్రినాకైఫ్‌ పెళ్లి పీటలెక్కనుందంటూ మరోసారి వార్తలొస్తున్నాయి. కొంతకాలంగా కత్రినాకైఫ్‌, విక్కీ కౌశల్‌ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వింటున్నాం. పలు కార్యక్రమాల్లో ఈ ఇద్దరూ జంటగానే సందడి చేస్తూ కనిపించారు. తాజాగా వీరిద్దరూ డిసెంబరులో పెళ్లి పీటలెక్కనున్నారనే వార్త బాలీవుడ్‌లో సందడి చేస్తుంది. రాజస్థాన్‌లోని ఓ పురాతన కోటలో పెళ్లి వేడుక జరగనుందంటూ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. హిందూ సంప్రదాయం, క్రిస్టియన్‌ పద్ధతుల్లో పెళ్లి వేడుక డిసెంబరు 7 నుంచి 9 వరకూ జరగనుందని సమాచారం. ఇప్పటివరకూ ఈ విషయంపై కత్రినా, విక్కీ..ఇద్దరిలో ఎవరూ స్పందించలేదు. గతంలో ఓ సారి రోఖా వేడుక జరిగిందంటూ వచ్చిన వార్తల్ని కత్రినా ఖండించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని