Mahaveerudu: సెట్స్‌పైకి ‘మహావీరుడు’

శివ కార్తికేయన్‌ హీరోగా మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహావీరుడు’. అరుణ్‌ విశ్వ నిర్మాత. అదితి శంకర్‌ కథా నాయిక. ఈ సినిమా  శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

Updated : 06 Aug 2022 02:30 IST

శివ కార్తికేయన్‌ హీరోగా మడోన్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మహావీరుడు’. అరుణ్‌ విశ్వ నిర్మాత. అదితి శంకర్‌ కథా నాయిక. ఈ సినిమా  శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ఇందులో శివ కార్తికేయన్‌ మాస్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: భరత్‌ శంకర్‌, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న.


వెలుగు చూడని నిజాలతో...

శ్వర్‌బాబు.డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘1948 - అఖండ భారత్‌’. గాంధీగా రఘునందన్‌, గాడ్సేగా డా.ఆర్యవర్ధన్‌ రాజ్‌, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌గా శరద్‌ దద్భావల, నెహ్రూగా ఇంతియాజ్‌ నటించిన చిత్రమిది. ఎం.వై.మహర్షి నిర్మాత. భారతీయ భాషల్లోనూ, ఇతర ముఖ్య అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘96 పాత్రలు, 114 సన్నివేశాలు, 700కిపైగా వస్తువులు, 500కిపైగా జూనియర్‌ ఆర్టిస్టులతో చేసిన సినిమా ఇది. 47 లొకేషన్లలో 9 షెడ్యూళ్లల్లో సినిమా తీశాం’’ అన్నారు. డా.ఆర్యవర్ధన్‌ రాజు మాట్లాడుతూ ‘‘డెబ్భై ఏళ్లపాటు వెలుగులోని నిజాల్ని... ప్రామాణికంగా పరిశోధన చేసి ఈ సినిమాకి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. మహాత్మాగాంధీ హత్యకి 45రోజుల ముందు మొదలై... హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. వివాదాలకి తావులేని రీతిలో ఈ సినిమాని రూపొందించాం’’ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకి ధృవీకరించడానికి నిరాకరిస్తే మేం ముంబయి వెళ్లి అక్కడ సెన్సార్‌ చేయించామని నిర్మాత తెలిపారు. తెలుగువాళ్లంతా గర్వపడేలా రూపొందించారని మెచ్చుకున్నారు టి.ప్రసన్నకుమార్‌. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రజ్వల్‌ క్రిష్‌, ఎడిటర్‌ రాజుజాదవ్‌, నటుడు సుహాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు