‘ఆ అమ్మాయి..’ కలల్ని నెరవేర్చే దర్శకుడు

సుధీర్‌ బాబు కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. బి.మహేంద్ర బాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. కృతి శెట్టి కథానాయిక. అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 16న ప్రేక్షకుల

Updated : 06 Sep 2022 14:11 IST

సుధీర్‌ బాబు కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. బి.మహేంద్ర బాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మించారు. కృతి శెట్టి కథానాయిక. అవసరాల శ్రీనివాస్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హీరో మహేష్‌బాబు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. నటి అవ్వాలని కలలుగనే మెడికో అమ్మాయి.. ఆమె కలను నిజం చేయాలనుకునే ఓ సక్సెస్‌ఫుల్‌ ఫిల్మ్‌మేకర్‌.. వీరి లక్ష్యానికి అడ్డు తగిలే అమ్మాయి తల్లిదండ్రులు.. ఈ ముగ్గురి మధ్య సాగే కథ ఇది. ఇందులో దర్శకుడి పాత్రను సుధీర్‌ పోషిస్తుండగా.. నటి అవ్వాలని కలలు కనే డాక్టర్‌ పాత్రలో కృతి నటించింది. తన తల్లిదండ్రుల్ని ఎదిరించి నటిగా మారేందుకు ఆమె ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంది? ఈ క్రమంలో ఆమెతో సినిమా చేసేందుకు సుధీర్‌ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? వీరి ప్రేమకథ ఏ కంచికి చేరింది? అన్నది మిగతా కథ. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. సినిమాలో ఎమోషన్స్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణను ఆసక్తికరంగా చూపించారు. ‘‘చాలా మంది మొగుళ్లకి పెళ్లాం వాళ్ల వరకు స్టార్లలా ఉంటే చాలు. జనాలకు కూడా నచ్చితే తట్టుకోలేరు’’ అంటూ ప్రచార చిత్రంలో వినిపించిన సంభాషణ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్‌ సాగర్‌, ఛాయాగ్రహణం: పీజీ విందా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని