మేలో హిందీ ‘ఛత్రపతి’

‘ఛత్రపతి’గా బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ప్రభాస్‌-రాజమౌళిల హిట్‌ సినిమా ‘ఛత్రపతి’కి రీమేక్‌ ఇది.

Published : 28 Mar 2023 03:00 IST


‘ఛత్రపతి’గా బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ప్రభాస్‌-రాజమౌళిల హిట్‌ సినిమా ‘ఛత్రపతి’కి రీమేక్‌ ఇది. వి.వి.వినాయక్‌ తెరకెక్కించారు. పెన్‌ స్టూడియోస్‌ పతాకంపై ధవల్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మే 12న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను పంచుకుంది. అందులో శ్రీనివాస్‌ కండలు తిరిగిన దేహంతో ఓ చేతిలో రాగి చెంబు పట్టుకొని, వీపుపై గాయాలతో యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. ఇది ఆయనకు, వినాయక్‌కు తొలి హిందీ చిత్రం. మాతృకకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్‌ ఈ రీమేక్‌ వెర్షన్‌కూ రచయితగా పని చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంగీతం: తనిష్క్‌ బాగ్చి, ఛాయాగ్రహణం: నిజార్‌
అలీ షఫీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు