Prabhas-Nayanthara: శివ పార్వతులుగా నటిస్తున్నారా?

‘కన్నప్ప’ కోసం ప్రభాస్‌... నయనతార కలిసి కెమెరా ముందుకు రానున్నారా? ఈ ఇద్దరూ తెరపై శివ పార్వతుల పాత్రల్లో కనిపిస్తారా? చిత్రబృందం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది.

Updated : 24 Sep 2023 09:30 IST

‘కన్నప్ప’ కోసం ప్రభాస్‌... నయనతార కలిసి కెమెరా ముందుకు రానున్నారా? ఈ ఇద్దరూ తెరపై శివ పార్వతుల పాత్రల్లో కనిపిస్తారా? చిత్రబృందం ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తోంది. మంచు విష్ణు ప్రధాన పాత్రధారిగా ‘కన్నప్ప’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం మొదలైంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్‌ నటించనున్నట్టు సమాచారం. ఇటీవల మరో కీలక పాత్ర కోసం చిత్రబృందం నయనతారని సంప్రదించింది. శివ పార్వతుల పాత్రలకోసమే ఆ ఇద్దరినీ సంప్రదించారని సమాచారం. శివ భక్తుడైన కన్నప్ప కథతో ఈ చిత్రం రూపొందుతోంది. భక్తి ప్రధానమైన ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో... అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మోహన్‌బాబుతో కలిసి మంచు విష్ణు నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని