
రవితేజ వచ్చేది ఎప్పుడంటే..
పుట్టినరోజు సందర్భంగా..
హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘క్రాక్’. శ్రుతిహాసన్ కథానాయిక. గోపించంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆదివారం రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘క్రాక్’ చిత్రబృందం మాస్ మహారాజ అభిమానులుకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘క్రాక్’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ గెటప్‌లో ఉన్న ఓ స్పెషల్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన చిత్రబృందం.. వేసవి కానుకగా మే 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు.
రవితేజ కథానాయకుడిగా నటించిన ‘డిస్కోరాజా’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జంటగా పాయల్ రాజ్‌పుత్, నభానటేశ్ నటించారు. బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్యరాజేశ్ కీలకపాత్రలను పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.