ఏయన్నార్‌ వద్దన్నా ఎన్టీఆర్‌ వదల్లేదు!

‘దాన వీర శూరకర్ణ’లో నటించమని ఏయన్నార్‌ను ఎన్టీఆర్‌ అడిగితే, తాను చేయనని సున్నితంగా చెప్పారట. ఇంతకీ ఆ కారణం ఏంటో తెలుసా?

Published : 13 Nov 2022 14:56 IST

ఎన్టీఆర్‌ ‘దాన వీర శూర కర్ణ’ తీయాలనుకుంటున్న రోజులవి. అందులో కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలో నటించమని ఏయన్నార్‌ని ఆయన కోరారట. ఎన్టీఆర్‌ని కృష్ణుడిగా చూసిన కళ్లతో తనను జనం చూడలేరనీ, అలాగే తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా కనిపిస్తారని అక్కినేని సున్నితంగా వద్దన్నారట. ఎన్టీఆర్‌ ఊరుకోలేదు. మర్నాడు ఏయన్నార్‌కి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి పిలుపు వచ్చింది. ‘మీరిద్దరూ కలిసి నటిస్తే జనం తప్పకుండా ఆదరిస్తారు. ఒప్పుకోండి’ అన్నారట జలగం. ఎన్టీఆర్‌కి చెప్పిన సమాధానమే ఆయనకూ చెప్పి ఏయన్నార్‌ అతి కష్టమ్మీద తప్పించుకున్నారట. ఆ చిత్రం తర్వాతా ఎన్టీఆర్‌ పట్టు విడవలేదు. తర్వాతి చిత్రంలో ఏయన్నార్‌ని చాణక్యుడి పాత్రలో చూపించి తన మాట నెగ్గించుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని