జేఎన్‌యూ ఘటనపై స్పందించిన బన్నీ

జేఎన్‌యూలో జరిగిన దాడిపై టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్‌ స్పందించారు. ఇటీవల జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి పలువురు ఆగంతకులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జేఎన్‌యూలో జరిగిన దాడి పట్ల పలువురు...

Published : 09 Jan 2020 22:18 IST

హైదరాబాద్: జేఎన్‌యూలో జరిగిన దాడిపై టాలీవుడ్‌ కథానాయకుడు అల్లు అర్జున్‌ స్పందించారు. ఇటీవల జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి పలువురు ఆగంతకులు చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జేఎన్‌యూలో జరిగిన దాడి పట్ల పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్‌ సైతం జేఎన్‌యూ దాడిపై స్పందించారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా  ఓ ఆంగ్ల పత్రికతో ముచ్చటించారు. ఇందులో భాగంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతోన్న నిరసనల గురించి స్పందించారు.

‘జేఎన్‌యూలో జరిగిన దాడి గురించి తెలిసి నేనెంతో బాధపడ్డాను. దీనికి సరైన పరిష్కారం ఉంటుందని భావిస్తున్నాను.’ అని బన్నీ తెలిపారు. అనంతరం పౌరసత్వ సవరణ చట్టంపై జరుగుతున్న ఆందోళనల గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ నిజాయితీగానే ఉంటాను. ఇటీవల ఇదే విషయం గురించి అజయ్‌ దేవగణ్‌ చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి. ఏది ఏమైనా ప్రథమంగా మేమందరం సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేవాళ్లం. మాకూ గొంతు ఉంది. ఇలాంటి సంఘటన గురించి మాట్లాడగలిగే శక్తి కూడా ఉంది. కాకపోతే మేము ఏ విషయం గురించి మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే ఆ తర్వాత అది మా మీద ఎన్నో విధాలుగా ప్రభావం చూపిస్తుంది.’ అని బన్నీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని