రెస్పాన్స్‌ మామూలుగా లేదు: అనిల్‌ రావిపూడి

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, చెప్పినట్లే బొమ్మదద్దరిల్లిందని దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్‌లో.....

Updated : 13 Jan 2020 13:04 IST

థియేటర్‌లో ‘సరిలేరు..’ టీం సందడి

హైదరాబాద్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని, చెప్పినట్లే బొమ్మదద్దరిల్లిందని దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్‌లో చిత్ర బృందం అభిమానులతో కలిసి తొలి ఆటను వీక్షించింది. అనిల్‌తోపాటు కథానాయిక రష్మిక, నటి సంగీత, దేవిశ్రీ తదితరులు మార్నింగ్‌ షో చూశారు. థియేటర్‌లో రష్మికను చూసిన ఫ్యాన్స్‌ కేకలు పెట్టి, గోల చేశారు. వారందరినీ ఆమె పలకరించారు.

ఈ సందర్భంగా అనిల్‌ మీడియాతో మాట్లాడారు. ‘సినిమాకు విశేషమైన స్పందన వచ్చింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడే శ్రీరాములు థియేటర్‌లో షో చూశాం. విరామ సన్నివేశం సమయంలో ఒళ్లుగగుర్పొడిచిందని అంటున్నారు. రైలు ఎపిసోడ్‌ వచ్చినప్పుడు ఎవరూ సీటులో కూర్చోవడం లేదు.. పడిపడి నవ్వుతున్నారు. ఈ సంక్రాంతి నవ్వులతో నిండిపోతుందని ఆశిస్తున్నా. స్పందన మామూలుగా లేదు.. దద్దరిల్లిపోయిందంతే’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని