ఆ హీరోయిన్‌కు ప్రపోజ్‌ చేయలేదంటున్న దర్శకుడు!

నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ‘వాలి’, ‘ఖుషి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్ని తీసి, గత కొంతకాలంగా నటుడిగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు

Published : 16 Jan 2020 16:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాలి’, ‘ఖుషి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్ని తీసి, గత కొంతకాలంగా నటుడిగా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు ఎస్‌.జె.సూర్య. మహేశ్‌ నటించిన ‘స్పైడర్‌’లో సైకోగా ఆయన నటన విమర్శకులనూ మెప్పించింది. కాగా, నటుడిగా బిజీగా ఉన్న ఎస్‌.జె.సూర్యపై కోలీవుడ్‌లో ఒక వార్త హల్‌ చల్‌ చేయడం మొదలు పెట్టింది. నటి ప్రియా భవానీ శంకర్‌కు ఆయన లవ్‌ ప్రపోజ్‌ చేశారని, అందుకు ఆమె తిరస్కరించారని ప్రచారం మొదలైంది. ఈ వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారడంతో ఆయన ట్విటర్‌ వేదిక స్పందించారు!

‘‘కొందరు వ్యక్తులు పని గట్టుకొని అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌కు నేను లవ్‌ ప్రపోజ్‌ చేశానని, అందుకు ఆమె తిరస్కరించారని అన్ని మాధ్యమాల్లో గత కొద్దిరోజులు వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ‘మాన్‌స్టర్‌’ చిత్రం నుంచి ఆమె నాకు మంచి స్నేహితురాలు. అలాగే మంచి నటి కూడా. దయచేసి విసిగించకండి. అసత్య, ఆధారాల్లేని వార్తలు వ్యాప్తి చేయొద్దు’’ -ట్విటర్‌లో ఎస్‌.జె.సూర్య

ప్రస్తుతం ఎస్‌.జె.సూర్య నటుడిగా బిజీగా ఉన్నారు. ‘నెన్‌జమ్‌ మరప్పతిల్లాయ్‌’, ‘ఇరివాకలమ్‌’ తదితర చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని