ఇండియన్‌ సినిమాని ఏలాలనుకుంటున్నాను

భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఏలాలనుకుంటున్నారట టాలీవుడ్‌ సన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా వెండితెరపై సన్సేషన్‌ను క్రియేట్‌ చేసిన ఆయన ఆ సినిమాతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. గతేడాది విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మిశ్రమ ఫలితాలను...

Updated : 07 Dec 2022 17:51 IST

ట్రోల్స్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఏలాలనుకుంటున్నారట టాలీవుడ్‌ సన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా వెండితెరపై సన్సేషన్‌ను క్రియేట్‌ చేసిన ఆయన ఆ సినిమాతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. గతేడాది విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మిశ్రమ ఫలితాలను అందుకున్న విజయ్‌ ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. ‘సోషల్‌మీడియాలో మీ గురించి వస్తున్న ట్రోల్స్‌ చూసి ఎలా ఫీల్‌ అవుతారు’ అని ప్రశ్నించగా.. విజయ్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

‘ట్రోల్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిఒక్కరూ నా గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది. నెటిజన్లు తమ విలువైన సమయాన్ని ఉపయోగించిన నా స్టైల్‌, సినిమాల గురించి మీమ్స్‌ తయారు చేస్తున్నారు. బహుశా నేను ట్రోల్స్‌తో వాళ్లకు నిద్రలేని రాత్రులను ఇస్తున్నాను. నా మీద ట్రోల్స్‌ క్రియేట్‌ చేయడం చూస్తుంటే వాళ్ల కలల్లో కూడా నేనే ఉంటాననిపిస్తోంది. కానీ ఒక్కమాటలో చెప్పాలంటే నేను ఇండియన్‌ సినిమాని రూల్‌ చేయాలనుకుంటున్నాను’ అని విజయ్‌ అన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని