
రానా వాలెంటైన్స్ డే ప్లాన్స్ ఏంటో తెలుసా?
హైదరాబాద్: ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ నటుడు రానా. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. ప్రభు సోలోమన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా బుధవారం సాయంత్రం ‘హాథీ మేరే సాథీ’ టీజర్ విడుదల కార్యక్రమం వేడుకగా జరిగింది. టీజర్ విడుదల అనంతరం చిత్రబృందం విలేకర్లతో సరదాగా ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ విలేకరి.. ‘వాలెంటైన్స్ డే రాబోతుంది కదా.. మీ ప్లాన్స్ ఏమిటి?’ అని అడగగా.. రానా తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
‘‘చిత్రబృందంతో కలిసి సినిమాను ప్రమోట్ చేసుకోవడమే ఈ వాలెంటైన్స్ డేకి నా ప్లాన్. ‘హాథీ మేరే సాథీ’ హిందీ వెర్షన్‌లో సెకండాఫ్‌కి ఇంకా డబ్బింగ్ చెప్పాల్సి ఉంది’’ అని రానా చెప్పారు. అనంతరం ప్రేమకు అర్థం చెప్పాలని కోరగా.. ‘‘నాకు అంతగా తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు’’ అని రానా చెప్పారు.
Advertisement