చీరతో కష్టమే సుమీ!

ఎంత కాదన్నా... చీరతో వచ్చే అందమే వేరు. ఇప్పటి ఫ్యాషన్‌ వస్త్రాల్లో లేని సొగసు, సౌందర్యం చీరలో ఉంది. అయితే చీర కట్టు కూడా ఓ కళే. అది  అందరికీ రాదు. ‘నాక్కూడా చీరలంటే ఇష్టమే.

Published : 26 Feb 2020 10:36 IST

ఎంత కాదన్నా... చీరతో వచ్చే అందమే వేరు. ఇప్పటి ఫ్యాషన్‌ వస్త్రాల్లో లేని సొగసు, సౌందర్యం చీరలో ఉంది. అయితే చీర కట్టు కూడా ఓ కళే. అది  అందరికీ రాదు. ‘నాక్కూడా చీరలంటే ఇష్టమే. కానీ దాంతో నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి’ అంటోంది పూజా హెగ్డే. తను మాట్లాడుతూ ‘‘హైస్కూలు రోజుల్లోనే చీర కట్టాను. స్కూల్లో ఓ ఫంక్షన్‌కి తొలిసారి చీర కట్టుకుని వెళ్లాను. అది మా అమ్మ చీర. నాకు బాగా కుదిరింది. మా టీచర్లు నన్ను ఎంత మెచ్చుకున్నారో. కానీ.. చీర కట్టుకోవడం నాకు అదే తొలిసారి కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను. నా ఒంటి నుంచి ఎప్పుడు జారిపోతుందో అని ప్రతి క్షణం భయపడ్డాను. ఇంటికి రాగానే ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా నా మామూలు డ్రస్సింగ్‌ స్టైల్‌కి వచ్చేశాను. ఇప్పటికీ చీర  కట్టుకోవడం అంటే కొంచెం భయమే. ఇంట్లో పూజలు, వేడుకలు జరుగుతున్నప్పుడు తప్పదు గానీ, పార్టీలకు వెళ్లేటప్పుడు చీర జోలికి వెళ్లను’’ అంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని