వర్మ మేధావి: ఇషా కొప్పికర్‌

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక మేధావి అని అంటున్నారు నటి ఇషా కొప్పికర్‌. 2002లో వర్మ దర్శకత్వం వహించిన ‘కంపెనీ’ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంతో గుర్తింపు తెచ్చుకున్న ఇషా తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ కోసం ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కానీ ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది...

Published : 21 Mar 2020 11:52 IST

వెబ్‌సిరీస్‌తో ఆయన తన స్థానాన్ని కైవసం చేసుకుంటారు

ముంబయి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఒక మేధావి అని అంటున్నారు నటి ఇషా కొప్పికర్‌. 2002లో వర్మ దర్శకత్వం వహించిన ‘కంపెనీ’ సినిమాలోని ఓ ప్రత్యేక గీతంతో గుర్తింపు తెచ్చుకున్న ఇషా తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ కోసం ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇషా కొప్పికర్‌ మాట్లాడుతూ.. ‘వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ చాలా వరకూ పూర్తయ్యింది. ఆర్జీవీ సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు నలుగురు దర్శకత్వం వహిస్తున్నారు. వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ మొత్తం పూర్తికాగానే దాని ఫైనల్‌ వర్క్‌ను ఆర్జీవీకి అందిస్తారు. ఆయన పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులను చూసి.. వెబ్‌సిరీస్‌తో ఓ మేజిక్‌ను క్రియేట్‌ చేస్తాడని భావిస్తున్నాను.’ అని ఇషా తెలిపారు.

అనంతరం ఆమె రామ్‌గోపాల్‌ వర్మ గురించి మాట్లాడుతూ.. ‘రామ్‌గోపాల్‌ ఒక మేధావి. భారతీయ సినీ చరిత్రలోనే పేరుపొందిన ఎన్నో అద్భుతమైన చిత్రాలను ఆయన తెరకెక్కించారు. నేను చూసిన మొదటి హార్రర్‌ చిత్రం ‘రాత్‌’(తెలుగులో రాత్రి). అలాగే ఏ జోనర్‌లో చూసుకున్నా సరే ఆయన ‘భూత్‌’, ‘రంగీలా’, ‘సత్య’ లాంటి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదొడుకులనేవి ఉంటాయి. దానర్థం ఆ మనిషి అంతటితో ముగిసిపోయినట్లు కాదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో ఉండేవారికి ప్రతి శుక్రవారం కూడా కొందరికి సత్ఫలితాలు రావొచ్చు.. మరికొందరికీ మిశ్రమ ఫలితాలు రావొచ్చు.’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని