మా ఇంటి వద్ద పరిస్థితి ఇది అంటోన్నసెలబ్రిటీలు

ప్రమాదకరమైన కరోనా వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రధాని మోదీ విధించిన జనతా కర్ఫ్యూను ప్రజలు పాటించారని సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. అమితాబ్‌ బచ్చన్‌, అభిషేర్‌ బచ్చన్‌, సునీల్‌ శెట్టి, అనుపమ్‌ ఖేర్‌, నాని, దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు తమ ఇంటి .....

Updated : 14 Jan 2022 14:13 IST

సోషల్‌మీడియాలో వీడియోలు

ముంబయి: ప్రమాదకరమైన కరోనా వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూను ప్రజలు పాటించారని సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. అమితాబ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, సునీల్‌ శెట్టి, అనుపమ్‌ ఖేర్‌, నాని, దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు తమ ఇంటి సమీపంలో తీసిన వీడియోలను సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేదని తెలిపారు.

‘ఆదివారం ఉదయం ముంబయి మెరీనా బీచ్‌ తీరం.. జాతీయ క్రమ శిక్షణ అంటే ఇదే. జై హింద్‌’ అని బిగ్‌బి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

‘వన్‌ ఇండియా.. వన్‌ పీపుల్‌’ అంటూ నటుడు సునీల్‌ శెట్టి వీడియోను పంచుకున్నారు.


‘ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. ఇన్నాళ్లూ శబ్దాల వల్ల మన ఇంట్లో మన బాల్కనీలో ఎవరు ఉన్నారో కూడా తెలియలేదు.. చూడండి’ అంటూ తన బాల్కనీ చెట్టుపై గూడుకట్టుకుని ఉన్న పక్షుల్ని నేచురల్‌స్టార్‌ నాని చూపించారు.


సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ కూడా తన ఇంటి వద్ద పరిస్థితిని వీడియో ద్వారా చూపించారు. చాలా ప్రశాంతంగా ఉందని, పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయని, ఏదో రిసార్ట్‌లో ఉన్న భావన కల్గుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూకి న్యాయం చేసుంటారని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన ప్రాంతంలో తీసిన ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ప్రియమైన భారతీయులారా.. మీ నగరంలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా సాగిందా? మీ ప్రాంతం, వీధిలో తీసిన ఫొటోలు నాకు పంపండి. వాటిలో కొన్ని రీట్వీట్‌ చేస్తా. #AnupamSeeMyCity అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించండి’ అని నెటిజన్లను ఉద్దేశిస్తూ పోస్ట్‌ చేశారు. తన ఇంటి బయట పక్షుల రాగాలు ఎప్పుడూ వినిపించలేదని, తొలిసారి ఇవాళ వినిపించాయని అనుపమ్‌ వీడియోను కూడా పంచుకున్నారు. ఈ ప్రపంచం ఇంకా ఉత్తమంగా మారబోతోందని ఆనందం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని