ఇది ఈవెంట్‌ కాదు.. మూవ్‌మెంట్‌

కరోనావైరస్‌పై చేస్తున్న పోరాటంలో మనందరం తప్పకుండా విజయం సాధిస్తామని నటుడు సాయికుమార్‌ అన్నారు. ప్రపంచదేశాలను గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ కారణంగా ఎందరో ప్రాణాలు కోల్పోయారని.. కోల్పోతున్నారని...

Updated : 06 Apr 2020 19:09 IST

కరోనాపై గెలుస్తాం.. గెలిచి తీరతాం..

హైదరాబాద్‌: కరోనావైరస్‌పై చేస్తున్న పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని నటుడు సాయికుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని రూపొందించి ప్రజలతో పంచుకున్నారు.

‘జై భారత్‌. నా తోటి భారతీయులకు నమస్కారం. మీలో ఒక్కడినైనందుకు గర్వపడుతున్నాను. మన ప్రియతమ ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ అంటే  పాటించాం. లాక్‌డౌన్‌ అంటే లాక్‌ అయ్యాం. చప్పట్లు కొట్టమంటే కొట్టాం. దీపాలు వెలిగించమంటే వెలిగించాం. ఇది ఒక ఈవెంట్‌ కాదు.. మూవ్‌మెంట్‌. ఇది ప్రజల ఉద్యమం. మనం చేసింది, చేస్తోంది మోదీ కోసం కాదు.. మన కోసం. ఈ రోజు కరోనా ప్రపంచమంతా విలయతాండవం చేస్తోంది. న్యూయార్క్‌ నుంచి న్యూదిల్లీ వరకూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.. పోగొట్టుకుంటున్నారు. జీవితం ప్రశ్నార్థకంగా మారింది. దీనికి పరిష్కారం ఒక్కటే.. సామాజిక దూరం. ఇళ్లల్లో ఉండండి. ప్రభుత్వ నియమాలను ఆచరించండి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. జోకులొద్దు.. విమర్శలొద్దు.. రాజకీయ స్వార్థాలు వద్దు. మనకెందుకులే.. మనకు రాదులే అనే నిర్లక్ష్యం అసలే వద్దు. మతం, కులం, భాష, వర్గం.. వీటన్నింటికీ అతీతంగా మనమందరం భారతీయులుగా ఐక్యమత్యంగా ఈ కరోనాపై పోరాడదాం. గెలుస్తాం.. గెలిచి తీరతాం.’ అని సాయి కుమార్‌ పేర్కొన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని