నేను అయోమయంలో లేను: రామ్‌

యువ కథానాయకుడు రామ్‌ అయోమయంలో ఉన్నారని ఓ పత్రిక వార్తను ప్రచురింది. ఆయన నటించిన సినిమా ‘రెడ్‌’ను థియేటర్‌లో విడుదల చేయకపోవచ్చని కథనంలో పేర్కొంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత ఆయన నటించిన సినిమా ‘రెడ్‌’. కిశోర్‌ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజ్‌.....

Published : 11 Apr 2020 20:42 IST

వార్తా పత్రిక కథనంపై హీరో రియాక్షన్‌

హైదరాబాద్‌: తను ఎటువంటి తికమకలో లేనని యువ కథానాయకుడు రామ్‌ స్పష్టం చేశారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత ఆయన నటించిన సినిమా ‘రెడ్‌’. కిశోర్‌ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజ్‌, అమృత అయ్యర్‌, మాళవికా శర్మ కథానాయికలు. ఈ సినిమా విడుదల సమయానికి లాక్‌డౌన్‌ విధించడంతో వాయిదా పడింది. అయితే ఇప్పుడు రామ్‌ అయోమయంలో ఉన్నారని ఓ పత్రిక వార్తను ప్రచురించింది. ‘రెడ్‌’ను థియేటర్‌లో విడుదల చేయకపోవచ్చని కథనంలో పేర్కొంది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన వెంటనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్‌ భావించిందని, అయితే వెంటనే థియేటర్లు, మాల్స్‌ ప్రారంభిస్తారో? లేదో? అనే అనుమానంతో నిర్మాతలు చిత్రాన్ని నేరుగా ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆంగ్లపత్రిక రాసింది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో రామ్‌ అయోమయంలో ఉన్నారని, ఆయన సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయాలని భావిస్తున్నారని పేర్కొంది.

ఈ వార్తను చూసిన రామ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది నిజం కాదు. నేను ఎటువంటి అయోమయంలో లేను. ప్రభుత్వ సూచనల మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఎంజాయ్‌ చేస్తున్నా. అంతేకాదు అభిమానులకు వెండితెరపై ‘రెడ్‌’ సినిమాను చూపించేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్‌ చేశారు.

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని