మాస్‌ స్టెప్‌లతో మతి పోగొట్టిన నటి ప్రగతి

తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మ, వదిన పాత్రలు అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చే పేర్లలో ప్రగతి తప్పకుండా ఉంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల

Published : 13 Apr 2020 20:22 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో అమ్మ, వదిన పాత్రలు అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చే పేర్లలో ప్రగతి తప్పకుండా ఉంటారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల తల్లి పాత్రలో ఆమె తనదైన నటనతో మెప్పిస్తారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో సినీ తారలందరూ సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు అందుబాటులో ఉంటూ ఆసక్తికర వీడియోలను పంచుకుంటున్నారు. తాజాగా ప్రగతి పంచుకున్న ఓ వీడియో వైరల్‌ అయింది.

ఎప్పుడూ హోమ్లీ పాత్రలు, చీరకట్టు, తెలుగుదనం ఉట్టిపడే పాత్రల్లో అలరించిన ప్రగతి ఒక్కసారిగా లుంగీ కట్టి మాస్‌ డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. విజయ్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మాస్టర్‌’ చిత్రంలోని తమిళ పాటకు స్టెప్‌లేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కావాలంటే మీరూ చూసేయండి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని