అకౌంట్‌లో సరిపడా డబ్బుల్లేవ్‌.. కానీ భయపడను

ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి నటన మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్‌ రౌడీగా పేరు తెచ్చుకున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో కథానాయకుడిగా మారిన ఆయన ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’...

Updated : 13 Sep 2023 14:00 IST

మంచి పనులతో ముందుకు వచ్చిన విజయ్‌ దేవరకొండ

హైదరాబాద్‌: ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి నటన మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్‌ రౌడీగా పేరు తెచ్చుకున్నారు నటుడు విజయ్‌ దేవరకొండ. ‘పెళ్లి చూపులు’ చిత్రంతో కథానాయకుడిగా మారిన ఆయన ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’ సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు.

ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన విజయ్‌.. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయాలనే లక్ష్యంతో ఓ మంచి కార్యక్రమంతో ముందుకు వచ్చారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ పూర్తయ్యాక చాలామంది ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారనున్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. తన వంతుగా కొంత మందికి ఉద్యోగం విషయంలో సాయం చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు.

‘మై లవ్స్‌. ఐ మిస్‌ యూ ఆల్‌. నేను మీ అందరి గురించి ఆలోచిస్తుంటాను. మీ అందరూ సంతోషంగా, జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే.. ఆ పేరు కూడా చెప్పాలని లేదు. ఎందుకంటే దాని పేరు విని, విని చిరాకు వచ్చేసింది. కానీ ఇది మనందర్నీ కట్టి, కొట్టింది. నన్ను కూడా. ఇలాంటి పరిస్థితులకు నేను మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా లేను. చూస్తే అకౌంట్‌లో సరిపడా డబ్బుల్లేవు. మా కుటుంబంతోపాటు 35 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన బాధ్యత నాపై ఉంది. డబ్బుల్లేకపోవడం కొత్తేం కాదు. అలవాటే.. భయపడను. కానీ 35 మందికి జీతాలు ఇవ్వడం అనేది కొత్త. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను రెండు మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చా. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాలకు సాయం చేయడం.. రెండోది భవిష్యత్‌లో ఉద్యోగాల విషయంలో కొందరికి సాయం చేయడం’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు. అనంతరం ఆయన రూ.1.30 కోట్ల ఫండ్‌ను వివిధ పద్ధతుల్లో ప్రజలకు సాయం చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

విజయ్‌ దేవరకొండ ఇల్లు చూశారా..!

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని