మోసగించిన ప్రియుడు.. నటి ఆత్మహత్య

కన్నడ నటి చందన ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి తనువు చాలించారు. ఈ తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రియుడు దినేష్‌ కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పారు. మే 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి కావాలనే.....

Published : 02 Jun 2020 14:41 IST

విషం తాగుతూ సెల్ఫీ వీడియో

బెంగళూరు: కన్నడ నటి చందన ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి తనువు చాలించారు. ఈ తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రియుడు దినేష్‌ కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పారు. మే 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి కావాలనే కలతో హాసన్‌ జిల్లా బేలూరుకు చెందిన చందన బెంగళూరుకు వచ్చారు. కన్నడ బుల్లితెరతోపాటు పలు ప్రకటనలు, సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. ఈ క్రమంలో దినేష్‌తో పరిచయం ఏర్పడింది. గత ఐదేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోమని అడగగా.. దినేష్‌ నిరాకరించాడు. చందన అతడి కుటుంబ సభ్యుల్ని కలిసి మాట్లాడగా.. వాళ్లు అవమానించి, పంపారు.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె విషం తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. దినేష్‌ తనను గర్భవతిని చేసి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని వీడియోలో ఆమె ఆరోపించారు. అతడి వల్ల అనేక విధాలుగా మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. విషం తాగి, వీడియోను కట్‌ చేశారు. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స ప్రారంభించడానికి ముందే పరిస్థితి విషమించి ఆమె మరణించారు. ఈ మేరకు పోలీసులు దినేష్‌ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దినేష్‌ పరారీలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని