Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి హర్నాజ్‌ సంధు

మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్‌ సంధు కైవసం చేసుకున్నారు. 

Updated : 13 Dec 2021 10:21 IST

ఇజ్రాయెల్‌: భారత మగువల అందం మరోసారి విశ్వవ్యాప్తమైంది. విశ్వసుందరి కిరీటం కోసం 21 ఏళ్లు కొనసాగిన నిరీక్షణకు ఎట్టకేలకు అందమైన ముగింపు లభించింది. అందంతో పాటు తెలివితేటలకూ పరీక్ష పెట్టే మిస్‌ యునివర్స్‌-2021 పోటీల్లో భారత యువతి హర్నాజ్‌ సంధు విజేతగా నిలిచింది. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్(1994)‌, లారా దత్తా(2000)ల సరసన చేరింది. తన అందంతో పాటు పదునైన సందేశం, తెలివైన సమాధానాలతో అందరినీ అబ్బురపరిచింది.

హర్నాజ్‌ సంధు పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. మోడలింగ్‌, వెండితెరపై  ఆసక్తితో ఆమె విద్యార్థి దశలోనే ఫ్యాషన్‌ రంగం వైపు అడుగులు వేశారు. మోడలింగ్‌లో రాణించడంతోపాటు పలు పంజాబీ చిత్రాల్లోనూ నటించారు. సోషల్‌మీడియాలోనూ ఆమెకు ఎక్కువమంది ఫాలోవర్స్‌ ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని