Godfather: ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ వచ్చేస్తోంది

మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న ‘గాడ్‌ ఫాదర్‌’(God Father) టీజర్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది....

Published : 18 Aug 2022 12:17 IST

హైదరాబాద్‌: మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తోన్న ‘గాడ్‌ ఫాదర్‌’(God Father) టీజర్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా టీజర్‌ని ఆయన  పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 21, ఆదివారం నాడు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. ‘‘మెగాస్టార్‌కు దారి ఇవ్వండి. గతంలో కంటే శక్తివంతంగా, భయాన్ని కలిగించనున్నారు’’ అని పేర్కొంది.

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకొన్న ‘లూసిఫర్‌’ రీమేక్‌గా ఇది సిద్ధమవుతోంది. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ సినిమాలో చిరంజీవి విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. మోహన్‌రాజా దర్శకుడు. నయనతార, సత్యదేవ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సల్మాన్‌ఖాన్‌, పూరీ జగన్నాథ్‌, సునీల్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెప్పించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇక ఆగస్టు 22న చిరంజీవి 67వ పుట్టినరోజు జరుపుకొనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని