Good Luck Sakhi: ఓటీటీలోకి వచ్చేసిన ‘గుడ్‌లక్‌ సఖి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నగేశ్‌ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘గుడ్‌లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.

Published : 12 Feb 2022 17:16 IST

హైదరాబాద్‌: కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నగేశ్‌ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ డ్రామా ‘గుడ్‌లక్‌ సఖి’. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గుడ్‌లక్‌ సఖి’ని ఓటీటీలో విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో నేరుగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలు పెట్టేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ఇదీ కథ: ఒక‌ మారుమూల ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన‌ బంజార యువ‌తి స‌ఖి (కీర్తి సురేష్‌). దుర‌దృష్టానికి చిరునామాగా నిలిచే ఆమెను.. ఊరి వారంతా బ్యాడ్ ల‌క్ స‌ఖి అని పిలుస్తుంటారు. ఆమె అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి చాలా ఇష్టం. వాళ్లిద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. స‌ఖి గురిపై రాజుకు మ‌హా న‌మ్మ‌కం. ఆమెలోని ఆ ప్ర‌తిభ‌ను గుర్తించే.. షూటింగ్ వైపు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇందుకోసం త‌మ ఊరికి వ‌చ్చిన క‌ల్న‌ల్ (జ‌గ‌ప‌తిబాబు) స‌హాయం తీసుకుంటాడు. ఆయ‌న ఓ రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. దేశం గ‌ర్వ‌ప‌డేలా మంచి షూట‌ర్స్‌ను త‌యారు చేయాల‌న్న‌ది ఆయ‌న క‌ల‌. స‌ఖిలోని ప్ర‌తిభ న‌చ్చి ఆమెకు షూటింగ్‌లో శిక్ష‌ణ ఇస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఈ ఆటలో పైకి ఎదిగే క్ర‌మంలో స‌ఖికి ఎదురైన స‌వాళ్లేంటి? వాట‌న్నింటినీ దాటుకుని ఎలా విజ‌యం సాధించింది? త‌న పేరును గుడ్ ల‌క్ స‌ఖిగా ఎలా మార్చుకుంది?  స‌ఖి - గోలిరాజుల ప్రేమ‌క‌థ ఏమైంది? అన్న‌ది తెర‌పై చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని