Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ ‘గుడ్‌లక్‌ జెర్రీ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

జాన్వీకపూర్‌ నటించిన బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ చిత్రం ‘గుడ్‌లక్‌ జెర్రీ’. సిద్ధార్థ్‌ సేన్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ తాజాగా ఖరారైంది.

Published : 17 Jun 2022 17:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) నటించిన బ్లాక్‌ కామెడీ క్రైమ్‌ చిత్రం ‘గుడ్‌లక్‌ జెర్రీ’ (Good Luck Jerry). సిద్ధార్థ్‌ సేన్‌గుప్త దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల తేదీ తాజాగా ఖరారైంది. నేరుగా ఓటీటీలోనే ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar) లో జులై 22 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానున్నట్టు తెలిపింది. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కి, విజయం అందుకున్న తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’కు ఈ సినిమా రీమేక్‌. లైకా ప్రొడక్షన్స్‌, కలర్‌ ఎల్లో ప్రొడక్షన్స్‌, మహావీర్‌ జైన్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దీపక్‌, నీరజ్‌ సూద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని