Dhanush: అవును.. నిజమే, ధనుష్‌తో ఆరేళ్లు మాటల్లేవు: జి.వి. ప్రకాశ్‌

నటుడు ధనుష్‌ (Dhanush)తో విభేదాలపై స్పందించారు సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌ (GV Prakash)

Published : 06 Apr 2024 14:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు ధనుష్‌, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్‌ ఎన్నోఏళ్ల నుంచి స్నేహితులనే విషయం తెలిసిందే. ధనుష్‌ హీరోగా నటించిన ‘మయక్కం ఎన్నా’, ‘ఆడుకలమ్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రాలకు జి.వి. సంగీతం అందించారు. వీరిద్దరి మధ్య మాటల్లేవని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆయా కథనాలపై సంగీత దర్శకుడు తాజాగా స్పందిస్తూ స్నేహితులన్నాక గొడవలు సహజం అన్నారు.

‘‘కష్టం, సుఖం.. ఇలా ఏ సమయంలోనైనా ధైర్యంగా నిలిచే వ్యక్తి స్నేహితుడు. అలాంటి స్నేహితులు మనందరికీ ఉంటారు. స్నేహితులన్నాక మనస్పర్థలు రావడం సహజం. ఆ సమయంలో అవసరమైనప్పుడు పరస్పరం అర్థం చేసుకోవడం అవసరం. అవును. నిజమే మేము దాదాపు ఆరేళ్లు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మా మధ్య పరిస్థితులు చక్కబడ్డాయి. మా స్నేహబంధం మరింత బలపడింది. ధనుష్‌ ఎంతో మంచి వ్యక్తి. ఇష్టమైన వారికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అతడితో క్రికెట్‌ ఆడటం నాకు ఇష్టం.’’ అని చెప్పారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ మేనల్లుడిగా జి.వి.ప్రకాశ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అలరిస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘బ్యాచిలర్‌’కు మంచి ఆదరణ లభించింది. ఆయన హీరోగా నటించిన ‘డియర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని