Tamannaah: ఏంటీ.. తమన్నా డ్రెస్సు అన్ని రూ. లక్షలా!

ఎప్పుడూ డ్రెండీగా కనిపించే తమన్నా ఇటీవల మరింత స్టైలిష్‌గా రెడీ అయి ఓ వేడుకకు హాజరైంది. ఆమె డ్రెస్సు.. ఈవెంట్‌కు హాజరైన తారలతోపాటు అభిమానుల్ని ఎంతగానో ఆకర్షించింది.

Published : 02 May 2022 01:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడూ ట్రెండీగా కనిపించే తమన్నా ఇటీవల మరింత స్టైలిష్‌గా రెడీ అయి ఓ వేడుకకు హాజరైంది. ఆమె డ్రెస్సు.. ఈవెంట్‌కు హాజరైన తారలతోపాటు అభిమానుల్ని ఎంతగానో ఆకర్షించింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ డ్రెస్సు ధరెంతో తెలుసుకోవాలని చాలామంది అన్వేషించారు. ఆ నోటా ఈ నోటా వినిపించిన రేట్‌ వివరాలు చూసి షాక్‌ అయ్యారు. స్కై బ్లూ కలర్‌లో... చాలా సింపుల్‌గా కనిపించే ఈ డ్రెస్‌ ఖరీదు రూ. 2,69,121 అని ప్రముఖ ఆంగ్ల మీడియాలో కథనం వెలువడింది. డ్రెస్సుకు మ్యాచింగ్‌గా వేసుకున్న తమన్నా చెప్పులూ అందరి దృష్టిలో పడ్డాయి. వాటి ధరను ఆరా తీయగా రూ. 90, 800 అని తేలింది. ‘ఏంటీ.. డ్రెస్సు, చెప్పులు అంత కాస్ట్‌లీనా’ అని ఇప్పుడు మీకూ అనిపిస్తోంది కదూ.

తాను నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘జీ కర్దా’ ప్రారంభానికి తమన్నా ఇలా హాజరైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది. వెంకటేశ్‌కు జోడీగా ఈమె నటించిన ‘ఎఫ్‌ 3’ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకురానుంది. సత్యదేవ్‌ సరసన ఈ మిల్క్‌ బ్యూటీ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ త్వరలోనే విడుదకానుంది. ప్రస్తుతం.. ‘భోళా శంకర్‌’ చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తోంది. వీటితోపాటు పలు హిందీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని