iifa 2023 awards winners: ఉత్తమ నటుడు హృతిక్‌ రోషన్‌.. నటి అలియా భట్‌

iifa 2023 awards winners: దుబాయ్‌ వేదికగా ఐఫా-2023 అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది.

Updated : 28 May 2023 06:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ సినీ తారల అందాలు, అదిరే ప్రదర్శనల నడుమ ఐఫా 2023 అవార్డుల (The International Indian Film Academy Awards 2023) వేడుక అట్టహాసంగా జరిగింది. దుబాయ్‌ వేదికగా శనివారం రాత్రి జరిగిన ఈ సంబరానికి బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. నోరాహి ఫతేహి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌ తదితర అందాల భామలు  తమ డ్యాన్స్‌లతో ఆహూతులను మైమరిపించారు.

ఇక ఈ ఏడాది ఐఫా 2023 (iifa 2023) అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ ‌(విక్రమ్‌ వేద) సొంతం చేసుకోగా, గంగూబాయి కాఠియావాడి చిత్రంలో నటనకు గానూ అలియాభట్‌ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక మిస్టరీ థ్రిల్లర్‌ ‘దృశ్యం2’ (హిందీ) ఉత్తమ చిత్రంగా నిలిచింది. అత్యధిక అవార్డులను ‘బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1’, ‘గంగూబాయి కాఠియావాడి’ చిత్రాలు దక్కించుకున్నాయి.

అలాగే అవుట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఫ్యాషన్‌ ఇన్‌ సినిమా అవార్డు మనీష్‌ మల్హోత్ర అందుకోగా, భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించినందుకు గానూ నటుడు కమల్‌హాసన్‌ అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా పురస్కారాన్ని అందుకున్నారు. అవుట్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ రీజినల్‌ సినిమా పురస్కారాన్ని రితేష్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా దంపతులు అందుకున్నారు. అలియా భట్‌ ఈ అవార్డుల వేడుకకు హాజరుకాలేదు. దీంతో ఉత్తమ నటి అవార్డును ఆమె తరపున నిర్మాత జయంతిలాల్‌ స్వీకరించారు.

ఐఫా 2023 అవార్డుల విజేతలు వీళ్లే (iifa 2023 awards winners)

  • ఉత్తమ నటుడు: హృతిక్‌ రోషన్‌ (విక్రమ్‌ వేద)
  • ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
  • ఉత్తమ సహాయ నటుడు: అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)
  • ఉత్తమ సహాయనటి: మౌనీ రాయ్‌(బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
  • ఉత్తమ దర్శకుడు: ఆర్‌.మాధవన్‌ (రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌)
  • ఉత్తమ చిత్రం: దృశ్యం2
  • ఉత్తమ సంగీత దర్శకుడు: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
  • ఉత్తమ గీత రచయిత: అమిత్‌ భట్టాచార్య (కేసరియా:  బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: గంగూబాయి కాఠియావాడి
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే : గంగూబాయి కాఠియావాడి
  • ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి
  • ఉత్తమ కొరియోగ్రఫీ: భూల్‌ భూలయా2
  • ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: భూల్‌ భూలయా 2
  • ఉత్తమ ఎడిటింగ్‌: దృశ్యం2
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ : బ్రహ్మాస్త్ర: పార్ట్‌-1
  • ఉత్తమ నేపథ్య సంగీతం: విక్రమ్‌ వేద
  • ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌: మోనికా ఓ మై డార్లింగ్‌
  • ఉత్తమ తొలి చిత్ర నటుడు: శంతను మహేశ్వరి (గంగూబాయి కాఠియావాడి), బబ్లీ ఖాన్‌(ఖులా)(ఇద్దరి మధ్య టై అయింది)
  • ఉత్తమ తొలి చిత్ర నటి: కుషాలీ కుమార్‌ (దోఖా: రౌండ్‌ డి కార్నర్‌)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని