Prabhas: నా లక్ష్యం అదే.. కథలను అలా ఎంపిక చేసుకుంటా: ప్రభాస్‌

‘సలార్‌’తో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర నటుడు ప్రభాస్‌. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 03 Jan 2024 16:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ప్రేక్షకులను అలరించడమే తన లక్ష్యమని ప్రముఖ హీరో ప్రభాస్‌ (Prabhas) తెలిపారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమా కథలను ఎంపిక చేసుకుంటానన్నారు. ‘సలార్‌’ (Salaar) విజయవంతమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సలార్‌’ సీక్వెల్‌ (Salaar Part 2), తదుపరి ప్రాజెక్టుల విశేషాలు వెల్లడించారు. ‘‘సలార్‌ 2’ స్క్రిప్టు పూర్తయింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ సీక్వెల్‌ కోసం నా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టు అప్‌డేట్స్‌ ఇస్తాం. నాకు విభిన్న నేపథ్య కథల్లో నటించాలనుంది. ప్రేక్షకుల నుంచి ‘సలార్‌’కు వచ్చిన స్పందనే నా తదుపరి సినిమాలకూ వస్తుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం హారర్‌, సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాల్లో నటిస్తున్నా’’ అని తెలిపారు.

చిరంజీవితో మల్టీస్టారర్‌ మొదలయ్యేది ఎప్పుడు?: విలేకరి ప్రశ్నకు వెంకటేశ్‌ ఏమన్నారంటే..?

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సలార్‌’లో ప్రభాస్‌.. దేవ పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన స్నేహితుడు వరద రాజమన్నార్‌గా మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అలరించారు. యాక్షన్‌ సీక్వెన్స్‌, నేపథ్య సంగీతం ఆడియన్స్‌కు కొత్త అనుభూతి కలిగించాయి. ఖాన్సార్‌ అనే సామ్రాజ్యం చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబరు 22న విడుదలైంది. ఇప్పటి వరకు రూ.644 కోట్లకుపైగా (గ్రాస్‌) వసూళ్లు సాధించింది. కొత్త సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్‌ కథానాయకుడిగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. డైరెక్టర్‌ మారుతి- ప్రభాస్‌ కాంబోలో హారర్‌ ఫిల్మ్‌ రూపొందుతోంది. ఇవి పూర్తయ్యాక సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో నటిస్తారు ప్రభాస్‌. ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో ‘సలార్‌ పార్ట్‌ 2’ రూపొందనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని