Disha: సినిమాను రెండు వారాలు ఆపండి

దిశ చిత్ర విడుదలను రెండు వారాలు ఆపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Published : 14 Jun 2021 15:55 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు, వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘దిశ’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా ఆపాలని దిశ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సినిమకు తామే దర్శక-నిర్మాతలమని ఆనంద్‌ చంద్ర, అనురాగ్‌లు న్యాయస్థానానికి వివరించారు. సినిమా టైటిల్‌ను ‘ఆశ ఎన్‌కౌంటర్‌’గా మార్చినట్లు తెలిపారు. సెన్సార్‌ బోర్డు కూడా సినిమాను వీక్షించి ఏ-సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు వివరించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెన్సార్‌ సర్టిఫికెట్‌ను సవాల్‌ చేసేందుకు వీలుగా వారం రోజులు సినిమా విడుదలను ఆపుతామని దర్శక-నిర్మాతలు కోర్టుకు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు సినిమా విడుదలను రెండు వారాలు ఆపాలని ఆదేశించింది. దిశ తండ్రి అప్పీలుపై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని