Trisha: కమల్‌కు జోడీగా త్రిష?

‘భారతీయుడు 2’ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌. ఆయన ‘కేహెచ్‌ 234’(వర్కింగ్‌ టైటిల్‌)లో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Updated : 13 Sep 2023 14:10 IST

‘భారతీయుడు 2’ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు అగ్రకథానాయకుడు కమల్‌హాసన్‌. ఆయన ‘కేహెచ్‌ 234’(వర్కింగ్‌ టైటిల్‌)లో ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చాలా కాలం తరవాత వీరిద్దరి కలయికలో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకులను భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ సరసన కథానాయిక త్రిష ఖరారైనట్లు సమాచారం. ఇంతక ముందు వీరిద్దరూ ‘తూంగా వనం’, ‘మన్మధన్‌ అంబు’ సినిమాల్లో కలిసి నటించారు. కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌, తమిళ నటుడు జయం రవి కూడా ఈ సినిమాలో  కీలక పాత్రల్లో నటించనున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని