‘ఇస్మార్ట్ శంక‌ర్‌’కి 200 మిలియన్ల వీక్షణలు

రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం  ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. బాక్సాఫీసు వ‌ద్ద ఘ‌న విజ‌యం అందుకున్న ఈ చిత్రం తాజాగా స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది.

Published : 31 May 2021 01:05 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంక‌ర్‌’. 2019లో బాక్సాఫీసు వ‌ద్ద ఘ‌న విజ‌యం అందుకున్న ఈ చిత్రం తాజాగా స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన తెలుగు చిత్రాలు హిందీలో డబ్ అయ్యే విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన ఇస్మార్ట్ శంక‌ర్.. అత్య‌ధిక వీక్ష‌ణ‌లు సొంతం చేసుకుని సంచ‌ల‌నం సృష్టించింది. 200 మిలియ‌న్ (20 కోట్లు) మందికి పైగా ఈ చిత్రాన్ని వీక్షించారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఇంత‌మంది చూడ‌టం విశేషం. యాక్ష‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ త‌న‌లోని మాస్ కోణాన్ని ఆవిష్క‌రించారు. టైటిల్ పాత్ర పోషించి మంచి క్రేజ్ సంపాదించారు. రామ్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ న‌టించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు