Jalsa: పాత్రికేయురాలిగా విద్యాబాలన్‌.. ఆసక్తిగా ‘జల్సా’ ట్రైలర్‌

బాలీవుడ్‌ ప్రముఖ నటి విద్యాబాలన్‌ పాత్రికేయురాలిగా నటించిన చిత్రం ‘జల్సా’. షెఫాలీ షా, రోహిణి హట్టంగడి, సూర్య కాశీభట్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 09 Mar 2022 14:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ ప్రముఖ నటి విద్యాబాలన్‌ పాత్రికేయురాలిగా నటించిన చిత్రం ‘జల్సా’. షెఫాలీ షా, రోహిణి హట్టంగడి, సూర్య కాశీభట్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేశ్‌ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది. ‘అమెజాన్‌ ప్రైమ్‌’లో మార్చి 18నుంచి స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఓ కారు ప్రమాదం సన్నివేశంతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రిపోర్టర్‌గా విద్యాబాలన్‌ నటన అందరినీ ఆకట్టుకునేలా ఉంది. భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, విక్రమ్‌ మల్హొత్రా, శిఖా శర్మ, సురేశ్‌ త్రివేణి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు గౌరవ్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని