Ginna: మంచు విష్ణతో సన్నీ లియోనీ స్టెప్పులు.. ఉర్రూతలూగించేలా ‘జిన్నా’ సాంగ్‌

మంచు విష్ణు హీరోగా దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిన్నా’. ఈ సినిమాలోని హుషారైన గీతాన్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.

Published : 10 Oct 2022 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా దర్శకుడు సూర్య  తెరకెక్కించిన చిత్రం ‘జిన్నా’ (Ginna). పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput), సన్నీ లియోనీ (Sunny Leone) కథానాయికలు. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ హుషారైన గీతాన్ని విడుదల చేసింది. ‘నువ్వొస్తావని నేను సిల్క్‌ చీర కట్టుకుంటిని’ అంటూ సాగే ఈ పాటను గణేశ్‌ రచించారు. నిర్మలా రాథోడ్‌, సింహ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. విష్ణు, సన్నీలపై చిత్రీకరించిన పాట ఇది. ఈ ఇద్దరి డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం పాట వింటూ స్టెప్పులు చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని