‘జాతిరత్నాలు’ ట్రైలర్‌: కడుపుబ్బా నవ్వాల్సిందే!

‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’తో అందర్నీ మెప్పించిన యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి. ‘జాతిరత్నాలు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అనుదీప్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated : 04 Mar 2021 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస ఆత్రేయ’తో అందర్నీ మెప్పించిన యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి. ‘జాతిరత్నాలు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అనుదీప్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా సందడి చేయనుంది. స్వప్న సినిమాస్‌ పతకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మిస్తున్నారు. రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. కాగా.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఆలస్యమెందుకు మీరూ చూసేయండి మరి.!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని