NTR: ‘వార్2’లో ఎన్టీఆర్ ఆ పాత్రలో కనిపించనున్నాడా..!
హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) కలిసి ఎన్టీఆర్ (NTR) నటిస్తోన్న సినిమా ‘వార్2’ (War 2). తాజాగా ఈ చిత్రంలో తారక్ పాత్రకు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఆర్‌ఆర్‌ఆర్’తో ఎన్టీఆర్ (NTR) ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో అలరిస్తోన్న ఎన్టీఆర్ ‘వార్2’ (War 2)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ‘వార్’కు సీక్వెల్‌గా అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరలవుతోంది. ఈ చిత్రంలో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడటని అంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. ఇందులో హృతిక్‌రోషన్‌కు (Hrithik Roshan) ఎన్టీఆర్‌కు మధ్య హోరాహోరీ సన్నివేశాలుంటాయని సమాచారం. నిడివి తక్కువ ఉన్న పాత్ర అయినప్పటికీ సినిమాకు అదే కీలకం కానుందట. షూటింగ్ కూడా నవంబర్‌లో ప్రారంభించనున్నారనే టాక్ వినిపిస్తోంది. తారక్ కూడా నవంబర్‌లోనే జాయిన్ కానున్నాడట. ఇప్పటికే ఈ యంగ్ హీరో దీని కోసం కసరత్తులు కూడా మొదలుపెట్టాడు. ఇక ‘వార్’ మొదటి భాగంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా పోటాపోటీగా నటించారు. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. దీంతో ‘వార్2’పై సినీ ప్రియుల్లో ఆసక్తి ఏర్పడింది.
మరోవైపు ఎన్టీఆర్ తన 30వ సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి రేపు ఫస్ట్‌లుక్ రానుంది. ‘రక్తంతో రాసిన అతని కథలతో సముద్రం నిండి ఉంది’ అంటూ విడుదల చేసిన ఓ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సముద్రం నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Shamshabad: బండరాయితో చంపేసి.. కారు కవర్లో చుట్టేసి.. అప్సర హత్య కేసులో కీలక వివరాలు
-
General News
Palnadu: పోస్టుమార్టానికీ లంచం !.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
-
Movies News
Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు తీవ్ర అనారోగ్యం.. సాయం చేస్తామన్న ఏపీ సీఎం ప్రత్యేక కార్యదర్శి
-
General News
TS High court: ప్రశ్నప్రతాల లీకేజీ కేసు.. సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటి?: హైకోర్టు
-
India News
Supreme Court: ‘ఉబర్.. ర్యాపిడో’పై మీరేమంటారు? కేంద్రాన్ని అభిప్రాయమడిగిన సుప్రీం!
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. భారత్ తొలి ఇన్నింగ్స్ 296/10