
NTR: ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లా.. ఆయన వల్లే కోలుకున్నా: ఎన్టీఆర్
ఇంటర్నెట్ డెస్క్: ‘ఆర్‌ఆర్‌ఆర్’తో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా తన వ్యక్తిగత విషయాన్ని ఓపెన్‌గా పంచుకున్నారు. ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాన్ని చెప్పారు. ఒకానొక సందర్భంలో డిప్రెషన్‌లోకి వెళ్లానని, అందులోంచి బయటపడడానికి రాజమౌళినే కారణమని తెలిపారు.
‘‘18 ఏళ్లకే సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చా. రెండో సినిమాకే స్టార్ స్టేటస్ చూశా. ఆ తర్వాత వచ్చిన కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ సమయంలో డిప్రెషన్‌కి గురయ్యా. సినిమా విజయం సాధించనందుకు బాధపడలేదు. భవిష్యత్ ఎలా ఉండబోతుందనే విషయంపై మానసిక ఒత్తిడికి గురయ్యా. అపజయాన్ని కష్టంగా భావించా. ఆ సమయంలో పని కూడా చేయలేకపోయేవాడిని. అంతా గందరగోళంగా అనిపించేది. ఆ పరిస్థితి నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది రాజమౌళినే. కష్టకాలంలో నా వెంటే ఉన్నాడు. నాలోని ప్రతికూల ఆలోచనలను పోగొట్టి ఉన్నత వ్యక్తిగానే కాదు.. చక్కటి నటుడిగా తీర్చిదిద్దాడు’’ అని ఎన్టీఆర్ చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.