Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ వేళ నటి కాజల్‌ చేస్తున్న కసరత్తుల వీడియో చూశారా?

ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌ ఫొటోలు, సీమంతం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ వస్తున్నారు.

Published : 01 Mar 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి కాజల్‌ అగర్వాల్‌ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌ ఫొటోలు, సీమంతం ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ వస్తున్నారు. తాజాగా బేబీ బంప్‌తో జిమ్‌లో ట్రైనర్‌ సాయంతో కసరత్తులు చేస్తున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. గర్భిణిలు చేయాల్సిన కసరత్తులకు సంబంధించి పలు సలహాలు సూచనలు చేశారు.  ఆ విశేషాలన్నీ ఆమె మాటల్లోనే...

‘‘నేనెప్పుడూ యాక్టివ్‌గా ఉండే వ్యక్తినే. నా జీవితంలో ఎక్కువగా వర్క్‌వుట్స్‌ చేస్తూ ఉంటా. కానీ, గర్భం దాల్చడమనేది కొత్త అనుభవం. ఎటువంటి సమస్యలు లేకుండా సుఖ ప్రసవం కోసం చిన్నపాటి వర్కవుట్లు, ఏరోబిక్స్ వంటివి చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఇలాంటివి చేయాలి. ఫిట్‌గా ఉండటానికి ఈ ఏరోబిక్స్ నాకు ఎంతో సాయపడుతోంది. ఈ కసరత్తులు నా ప్రెగ్నెన్సీకి ముందు ఇప్పుడు శరీరాన్ని మెరుగ్గా మార్చడంలో సహాయపడ్డాయి. ఇవన్నీ చేయడం వల్ల నా శరీరం బలంగా మారింది. శరీరాకృతిపరంగా సన్నగా ఉండగలుగుతున్నా’’ అంటూ తన ట్రైనర్‌తో కలిసి చేసిన వర్కవుట్లను కాజల్ షేర్ చేసింది.

ప్రెగ్నెన్సీ వేళ.. నాలో ఈ మార్పులు గమనించా: కాజల్‌

‘‘గర్భధారణ సమయంలో శరీరం బరువు పెరగడంతో పాటు అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా హార్మోన్ల మార్పులు. శిశువు పెరిగే కొద్దీ మన కడుపుతో పాటు రొమ్ముల ఆకృతి పెరుగుతుంది. కొందరికి మన శరీరం పెద్దగా ఉన్నచోట స్ట్రెచ్ మార్క్స్ ఉండొచ్చు. ఇంకొన్ని సార్లు మన చర్మం మొటిమలతో ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరం సాధారణంగా ఉన్నప్పటి కంటే.. బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. తరచూ మూడ్‌ స్వింగ్స్‌ ( మానసిక పరిస్థితి) మారుతూ ఉండొచ్చు’’

‘‘విపరీతంగా బరువు పెరిగిపోతాం. ఎమోషన్స్‌ ఉన్నట్టుండి మారిపోతాయి. ఒక్కోసారి నెగెటివ్‌ మూడ్‌ వల్ల అనారోగ్యానికీ గురి అవుతాం. డెలివరీ అయ్యాక కూడా సాధారణ స్థితిలోకి రావడానికి చాలా సమయం పడుతోంది. ఈ మార్పులన్నీ సహజమే. జీవితంలో ఇదొక అద్భుతమైన, అందమైన అనుభూతి. జన్మనివ్వడం, అమ్మ అవ్వడమనేది ఒక సెలబ్రేషన్‌’’



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని