Amitabh Bachchan: తీక్షణ చూపుల మహా సాధువు

అమితాబ్‌బచ్చన్‌.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. ఎనిమిది పదుల వయసు దాటినా ఆయన నటనలో వేగం తగ్గలేదు. 

Updated : 12 Oct 2023 13:52 IST

అమితాబ్‌బచ్చన్‌.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. ఎనిమిది పదుల వయసు దాటినా ఆయన నటనలో వేగం తగ్గలేదు. వైవిధ్యమైన పాత్రలను తన ఖాతాలో వేసుకుంటూ కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. ఇందులో అమితాబ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. బుధవారం అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ముఖానికి గుడ్డ చుట్టుకొని,  చేతిలో పొడవాటి కర్రతో, తీక్షణమైన చూపులతో ఓ మహా సాధువులా నిలబడిన అమితాబ్‌ లుక్‌ ఆకట్టుకుంటోందని నెటిజన్లు స్పందిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని