Keedaa Cola Review: రివ్యూ: ‘కీడా కోలా’... తరుణ్ భాస్కర్‌ కొత్త చిత్రం మెప్పించిందా?

Keedaa Cola Review in telugu: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం కీలక పాత్రల్లో తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వం వహించిన ‘కీడా కోలా’ ఎలా ఉందంటే?

Updated : 03 Nov 2023 00:33 IST

Keedaa Cola Review in telugu; చిత్రం: కీడా కోలా; నటీనటులు: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌; సంగీతం: వివేక్‌ సాగర్‌; సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌; ఎడిటింగ్‌: ఉపేంద్ర వర్మ; నిర్మాత: కె.వివేక్‌ సుధాంశు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌ నండూరి, శ్రీపాద్‌ నందరాజ్‌, ఉపేంద్ర వర్మ; సమర్పణ: రానా దగ్గుబాటి; రచన సహకారం: ప్రణయ్‌ కొప్పల, రమ్య కాకుమాను, సనాతన్‌ రాజ్‌; రచన, దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌; విడుదల: 03-11-2023

వారం చాలా సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. అందులో ప్ర‌త్యేక‌మైన అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన చిత్రం... ‘కీడా కోలా’ (Keedaa Cola). తార‌లు లేక‌పోయినా అన్ని అంచ‌నాల‌కి కార‌ణం... త‌రుణ్ భాస్క‌ర్‌. ఆయ‌న తీసింది రెండు సినిమాలే అయినా... ప్రేక్ష‌కుల‌పై ప్ర‌త్యేక‌మైన ముద్ర వేశారు. ఈసారి ఓ క్రైమ్ కామెడీ క‌థ‌తో ‘కీడాకోలా’ తెర‌కెక్కించారు.  ఇందులో ఆయ‌న ఓ కీలక పాత్ర‌లోనూ న‌టించారు. క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి స‌మ‌ర్పణ‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది?(Keedaa Cola Review in telugu) ఎలాంటి వినోదాన్ని పంచింది.

క‌థేంటంటే: వాస్తు (చైత‌న్య‌రావు), అత‌ని తాత వ‌ర‌ద‌రాజు (బ్ర‌హ్మానందం), లాయ‌ర్ అయిన కౌశిక్ (రాగ్ మ‌యూర్‌) వీళ్లంద‌రి ధ్యేయం డ‌బ్బు సంపాదించడ‌మే. తాత కోసం కొన్న శీత‌ల పానీయం కీడా కోలా బాటిల్‌లో బొద్దింక‌ని చూపించి య‌జ‌మానిని బ్లాక్‌మెయిల్ చేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతారు. రూ.5 కోట్ల నుంచి బేర‌సారాలు మొద‌ల‌వుతాయి. మ‌రోవైపు జీవ‌న్ (జీవ‌న్‌)కి కార్పొరేట‌ర్ కావాల‌నేది ఆశ‌. 20 ఏళ్లు జైల్లో ఉండి బ‌య‌టికి వ‌చ్చిన త‌న అన్న నాయుడు (Tarun bhaskar) అండ‌తో ఆ ప్ర‌య‌త్నాల్లోకి దిగుతాడు. జీవ‌న్ కార్పొరేట‌ర్ కావాల‌న్నా కూడా డ‌బ్బే అవ‌స‌రం కావ‌డంతో అందుకోసం వీళ్లు కూడా ఓ వ్యూహం ప‌న్నుతారు. (Keedaa Cola Review in telugu) మ‌రి వీళ్లంద‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? డ‌బ్బు సంపాదించారా?   వాస్తు గ్యాంగ్‌, జీవ‌న్ గ్యాంగ్ ఎలా క‌లిశారు? ఇంత‌కీ కోలాలోకి బొద్దింక ఎలా ప‌డింది? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే  తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ‘కీడా... ఇందులో ఉంది తేడా’ అంటూ సినిమాలో వినిపించే సంభాష‌ణ‌లాగే కొన్ని తేడాగా వ్య‌వ‌హ‌రించే పాత్ర‌ల చుట్టూ సాగే ఓ క్రైమ్ కామెడీ క‌థ ఇది. గ‌మ్మ‌త్తైన పాత్ర‌లు, వాటి  కోరిక‌లు, అసంబద్ధంగా అనిపించే ప్ర‌య‌త్నాలతో న‌వ్విస్తూ సాగుతుందీ చిత్రం. త‌రుణ్ భాస్క‌ర్ గ‌త చిత్రాలకీ ఈ సినిమాకీ పోలిక ఉండ‌దు. తొలి రెండు సినిమాల్ని వాస్త‌విక‌త‌కి పెద్ద పీట వేస్తూ స‌న్నివేశాల్ని న‌డిపించారు. అందుకు పూర్తి భిన్నంగా లాజిక్స్‌ని ఏమాత్రం పట్టించుకోకుండా, న‌వ్వించ‌డ‌మే టార్గెట్ అన్న‌ట్టుగా స్వేచ్ఛ‌గా ఇందులో స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. త‌రుణ్ తీసిన తొలి క్రైమ్ కామెడీ చిత్ర‌మిది. (Keedaa Cola Review in telugu) ఈ క‌థ‌ని న‌డిపించిన విధానం, ర‌చ‌నలో మాత్రం ఆయ‌న మార్క్ స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. విజువ‌ల్స్‌తోనూ, సంగీతంతోనూ, మాట‌ల‌తోనూ, పాత్ర‌ల హావ‌భావాల‌తోనూ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. ఓ కొత్త ర‌క‌మైన ప్ర‌య‌త్నం ఈ చిత్రం. వాస్తు, తాత‌, లాయ‌ర్ కోణంలో మొద‌ల‌య్యే ఈ సినిమా.. జీవ‌న్ పోస్ట‌ర్ డిజైన్ నుంచి ఊపందుకుంటుంది. నాయుడుగా త‌రుణ్ భాస్క‌ర్ ఎంట్రీ ఇచ్చాక క‌థ‌లో మ‌రింత వేగం పెరుగుతుంది. శ్వాస మీద ధ్యాస, రోజుకో గంట ఇంగ్లిష్ అంటూ ఆయ‌న చేయించే విన్యాసాలు సినిమాకి ఊపుని తీసుకొస్తాయి. స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధం వేగంగా పూర్త‌వుతుంది.

ద్వితీయార్ధం మ‌రింత సంద‌డిగా ఆరంభం అవుతుంది. కీడాకోలాకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ హీరోగా గెట‌ప్ శీను చేసే సంద‌డి, వాస్తు గ్యాంగ్‌, నాయుడు గ్యాంగ్ ఎదురెదుగా నిలుచుని స‌రెండ‌ర్ అంటూ చేసే హంగామా క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. (Keedaa Cola Review) నాయుడుని అంతం చేయ‌డానికి షాట్స్ ప‌లువురు షార్ప్ షూట‌ర్స్‌ని రంగంలోకి దించ‌డం, వాళ్లు చేసే హంగామా, బార్బీతో నాయుడు ప్రేమ‌లో ప‌డ‌టం వంటి స‌న్నివేశాలు ద్వితీయార్థంలో హైలైట్‌.  బ్ర‌హ్మానందం పాత్ర  వీల్ ఛెయిర్‌కే ప‌రిమిత‌మైనా సంద‌ర్భానుసారంగా న‌వ్విస్తుంది. మిగ‌తా పాత్ర‌ల్లాగే  గ‌మ్మ‌త్తుగా అనిపించినా... నాయుడు పాత్ర అంత‌ర్లీనంగా బ‌ల‌మైన సందేశాన్ని పంచుతుంది. చెప్పుకోద‌గ్గ క‌థ లేక‌పోయినా, కొన్ని స‌న్నివేశాలు ఊహ‌కు త‌గ్గ‌ట్టుగా సాగుతున్నా అవ‌స‌ర‌మైనప్పుడంతా ప్రేక్ష‌కుల్ని న‌వ్వించే చిత్ర‌మిది.

ఎవ‌రెలా చేశారంటే: ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌... ఈ సినిమాలో న‌టుడిగానూ మెరిశాడు. నాయుడుగా ఆయ‌న క‌నిపించిన విధానం, న‌ట‌న‌, కామెడీలో టైమింగ్ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. బ్ర‌హ్మానందం పాత్ర ప‌రిధి త‌క్కువే అయినా... చివ‌రి వ‌ర‌కూ సినిమాపై ఆయ‌న పాత్ర ప్ర‌భావం క‌నిపిస్తుంటుంది. (Keedaa Cola Review in telugu)  చైత‌న్య‌రావు వైక‌ల్యం ఉన్న యువ‌కుడిగా క‌నిపించాడు. మాట‌ల్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేని ఆ పాత్ర‌లో మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించాడు. రాగ్‌మ‌యూర్, జీవ‌న్‌, విష్ణు, ర‌ఘు, ర‌వీంద్ర విజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. చిన్న చిన్న పాత్ర‌లు కూడా న‌వ్విస్తాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. కెమెరా, ఆర్ట్, ఎడిటింగ్ విభాగాలు చ‌క్క‌టి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. త‌రుణ్ భాస్క‌ర్ తెలివైన ర‌చ‌న ఇందులో చాలా చోట్ల క‌నిపిస్తుంది.  కొన్ని మాట‌ల్ని హెడ్‌ఫోన్‌లో వినిపించే పాట‌ల‌తో త‌నే సెన్సార్ చేస్తూ న‌వ్వించారు. నిర్మాణంలో లోపాలేమీ లేవు.

  • బ‌లాలు
  • + కామెడీ... ర‌చ‌న  
  • న‌టులు  
  • సంగీతం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఊహ‌కు అందేలా క‌థ‌నం
  • చివ‌రిగా:  కీడాకోలా... న‌వ్వించే కీడా (Keedaa Cola Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు