Keerthy Suresh: కీర్తి సురేశ్‌.. ‘కన్నెవేది’

దసరా’, ‘నాయకుడు’ విజయాలతో జోరు మీదున్న కథానాయిక కీర్తి సురేశ్‌. తెలుగు, తమిళ,  కన్నడ భాషల్లో దూసుకెళ్తున్న ఈ నటి తాజాగా మరో చిత్రానికి సంతకం చేశారు.

Updated : 17 Jul 2023 14:09 IST

‘దసరా’, ‘నాయకుడు’ విజయాలతో జోరు మీదున్న కథానాయిక కీర్తి సురేశ్‌. తెలుగు, తమిళ,  కన్నడ భాషల్లో దూసుకెళ్తున్న ఈ నటి తాజాగా మరో చిత్రానికి సంతకం చేశారు. ఈ కొత్త ప్రాజెక్టు పేరు ‘కన్నెవేది’. ఆదివారం ట్విటర్‌లో ద్వారా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘నా తదుపరి ప్రాజెక్టు ‘కన్నెవేది’. మీ ప్రేమ, సహకారాలు కావాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. దాంతోపాటు పూజా కార్యక్రమాల ఫొటోలు సైతం పంచుకున్నారు. ఈ చిత్రాన్ని గణేష్‌రాజ్‌ తెరకెక్కిస్తుండగా.. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని