Keerthy suresh: అప్పుడే పదేళ్లు గడిచాయా!

‘ఇన్నేళ్లు గడిచినా... నా సినీ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెట్టినట్టుంది’ అంటోంది కీర్తి సురేశ్‌. 2013 నవంబరు 14న విడుదలైన మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తాజాగా పదేళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

Updated : 16 Nov 2023 12:29 IST

‘ఇన్నేళ్లు గడిచినా... నా సినీ ప్రయాణాన్ని ఇప్పుడే మొదలు పెట్టినట్టుంది’ అంటోంది కీర్తి సురేశ్‌. 2013 నవంబరు 14న విడుదలైన మలయాళ చిత్రం ‘గీతాంజలి’తో హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తాజాగా పదేళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దక్షిణాది చిత్రసీమలో అగ్రతారగా గుర్తింపు సాధించింది. ‘నేను శైలజ’తో తెలుగు తెరకు పరిచయమైన ఆమె ‘మహానటి’గా ఎదిగి, మంచి గుర్తింపు పొంది, జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. భిన్నమైన సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఎన్నో విజయాలను అందుకుంది. ఇటీవల సినీపరిశ్రమలోకి వచ్చి పదేళ్లను పూర్తి చేసుకున్న కీర్తి సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోను ప్రేక్షకులతో పంచుకుంది. ‘నా సినీ జీవితంలో పదేళ్లను పూర్తిచేసుకున్నాను. దానికి కారణమైన నా తల్లిదండ్రులకు, అభిమానులకు, ముఖ్యంగా ‘గీతాంజలి’ చిత్రంతో నన్ను నాయికగా పరిచయం చేసిన దర్శకుడు ప్రియదర్శన్‌ సర్‌కి కృతజ్ఞతలు. ఆయనే నా గురువు. నాతో పనిచేసిన దర్శకనిర్మాతలకు, సహనటులకు, మీడియాకి ధన్యవాదాలు. మంచి మంచి సినిమాలతో మిమ్మల్ని తప్పక అలరిస్తూనే ఉంటాను. ఎన్నేళ్లు గడిచిన నాపై మీ ప్రేమ అలాగే ఉంటుందని ఆశిస్తున్నాను’ అంటూ తెలిపింది. ప్రస్తుతం కీర్తి ‘సైరెన్‌’, ‘రఘుతాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివెడి’ లాంటి చిత్రా  లతో బిజీగా ఉంది. వరుణ్‌ ధావన్‌కు జోడీగా నటిస్తూ బాలీవుడ్‌లోను అడుగుపెట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని