KGF 2: మదర్స్‌ డే స్పెషల్‌.. ‘కేజీయఫ్‌-2’ వీడియో వచ్చేసింది

మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. యశ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా రెండో భాగం...

Published : 08 May 2022 22:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేజీయఫ్’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. యశ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా రెండో భాగం ‘కేజీయఫ్‌-2’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద రూ.1000 కోట్లకు పైగా భారీ కలెక్షన్స్‌తో సునామీ సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ‘కేజీయఫ్‌-2’ నుంచి వీడియో సాంగ్స్‌ని ఒక్కొక్కటిగా చిత్రబృందం విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘కేజీయఫ్‌-2’ నుంచి ‘‘ఎదగరా.. ఎదగరా..’’ అంటూ సాగే పాట ఫుల్‌ వీడియోని చిత్రబృందం షేర్‌ చేసింది. ‘అంతులేని గమ్యం కదరా.. అంతవరకూ లేదిక నిదరా.. చరితగా, ఘనతగా వెలగరా’ వంటి పవర్‌ఫుల్‌ లైన్స్‌ మనసుని తాకేలా ఉన్న ఈ పాటను సుచిత ఆలపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని