Yash: మా డాడీ బ్యాడ్‌ బాయ్‌.. యశ్‌ తనయుడి వీడియో వైరల్‌

‘కేజీయఫ్‌’తో(KGF) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్‌ (YASH) ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘కేజీయఫ్‌-2’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లు ....

Updated : 17 Jul 2022 18:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కేజీయఫ్‌’తో(KGF) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్‌ (YASH) ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ‘కేజీయఫ్‌-2’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కించే పనిలో పడిన ఆయన షూట్స్‌ లేకపోవడంతో ఇంట్లోనే ఉండి తన ఇద్దరు పిల్లలతో సరదా సమయాన్ని గడుపుతున్నారు. ఇందులో భాగంగానే యశ్‌ తాజాగా తన తనయుడు యథర్వ్‌ కలిసి ఓ సరదా వీడియో చేశారు. బ్రష్‌ చేయడం గురించి యశ్‌ మందలించడంతో కాస్త నొచ్చుకున్న యథర్వ్‌.. తన తల్లి రాధికా పండిత్‌ని హత్తుకుని.. ‘‘డడ్డా ఈజ్‌ ఏ బ్యాడ్‌ బాయ్‌’’ అని చెబుతూ కనిపించాడు. దీంతో యశ్‌.. ‘‘డాడా (నాన్న) ఈజ్‌ ఏ గుడ్‌ బాయ్‌’’ అనగా.. ‘‘నో.. నాన్న బ్యాడ్‌ బాయ్‌. అమ్మ గుడ్‌ గర్ల్‌‌’’ అని సమాధానమిస్తాడు. ఈ సరదా వీడియోని రాధిక ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని